భారత్ కు వచ్చేసిన 'ఆనర్ 10 లైట్'.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన జియో

  • ఢిల్లీలో విడుదలైన 'ఆనర్ 10 లైట్'
  • రెండు వేరియంట్ లలో లభ్యం 
  • ఈనెల 20 నుండి ఆన్ లైన్ లో విక్రయం
ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ ఆనర్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తన నూతన స్మార్ట్ ఫోన్ 'ఆనర్ 10 లైట్' ను లాంచ్ చేసింది. ఆనర్ ఇండియా స్టోర్లతో పాటు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ మనదేశంలో 4 జీబీ/6 జీబీ వేరియంట్లలో లభించనుంది. 4 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఈనెల 20 నుండి ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ పై జియో తన వినియోగదారుల కోసం రూ.2200 వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. అలాగే, దీనితో పాటు రూ.2800 విలువ గల క్లియ‌ర్ ట్రిప్ వోచ‌ర్ల‌ను కూడా కస్టమర్లు పొందనున్నారు.
Go Back to Shorts
Honor 10 Lite
smart phone
Tech-News
technology
China
New Delhi

More Telugu News